హైదరాబాద్: 28°C
తెలంగాణ

30 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

WGL: దుగ్గొండి మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 30 మంది ఉపాధ్యాయులు డీఎస్ఈ ఎస్ఆర్ఎస్‌లో ఆలస్యంగా హాజరు నమోదు చేసినట్లు డీఈఓ ప్రశాంత్‌రెడ్డి గుర్తించారు. వారికి గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేసి, రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే టీజీసీపీఏ రూల్స్‌–1991 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.