హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ మోటార్ చోరీ

MHBD: కేసముద్రం మండలంలోని ఇంటికన్నే గ్రామానికి చెందిన రైతు సోమారపు శ్రీరాములు తన ఎకరన్నర పొలంలో వేసిన పంట సాగునీటి కోసం రూ.30వేలతో కొత్త విద్యుత్ మోటార్ ఏర్పాటు చేసుకున్నారు. గురువారం పొలం దగ్గరికి వెళ్లి చూడగా, మోటార్‌ను విద్యుత్ తీగలతో సహా గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రైతు తెలిపారు.