హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రెడిటేషన్ కార్డుల జారీలో పారదర్శకత తప్పనిసరి

ADB: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా అర్హులకే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా అక్రెడిటేషన్ కమిటీ మూడో విడత సమావేశంలో ఆయన దరఖాస్తులను సమీక్షించారు. తప్పుడు సమాచారంతో కార్డులు పొందినా, దుర్వినియోగం చేసినా రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.