హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ పరిశోధనలకు ప్రత్యేక కేంద్రం..CPRI కీలక సేవలు!

HYD శివారులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPRI) విద్యుత్ రంగంలో కీలక సేవలందిస్తోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1993లో హైదరాబాద్‌లో అల్ట్రా హై వోల్టేజ్ రీసెర్చ్ లాబొరేటరీ ప్రారంభమైంది. ఇక్కడ 400 కేవీకి పైబడిన విద్యుత్ పరికరాలు, ప్రసార వ్యవస్థల పనితీరును పరీక్షిస్తూ నాణ్యత, భద్రతకు భరోసా కల్పిస్తోంది.