హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మీయ పలకరింపు

WNP: హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం కొత్తకోట మండలంలోని కానాయపల్లిలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డా. రావుల రవీంద్రనాథ్ నివాసానికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఆయన ఆరోగ్యంతో పాటు సతీమణి పారిజాతం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత రాజకీయ అనుభవాలను గుర్తుచేసుకుంటూ, రావుల రచించిన ఆత్మకథ పుస్తకాలను కార్యకర్తలకు అందజేశారు.