హైదరాబాద్: 28°C
తెలంగాణ

చనిపోయిన వారికి పెన్షన్లు ఇవ్వాలా: మంత్రి

NGKL: అచ్చంపేటలో గురువారం రాత్రి మంత్రి సీతక్క బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. పింఛన్లు తొలగిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, మరణించిన వారి పేర్లపై పింఛన్లు కొనసాగించాలా? వారి ఆత్మలకు పింఛన్లు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. అర్హులైన వారికే పింఛన్లు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె వ్యాఖ్యానించారు.