హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా కొనసాగుతున్న సామూహిక కార్తీక దీపోత్సవం

SRCL:వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస సామూహిక దీపోత్సవం వైభవంగా కొనసాగుతోంది. గురువారం 16వ రోజు రాత్రి వేడుకలను ఈవో రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాయంత్రం సుహాసినులు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించారు. పాల్గొన్న మహిళలకు ఆలయ అధికారులు పసుపు, కుంకుమ, గాజులు, వాయనం అందజేశారు.