హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

RR: పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఎల్బీనగర్ ఫాస్ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలికను వేధించిన కేసులో భూసగళ్ల పృథ్వీ ముధిరాజ్‌ను దోషిగా నిర్ధారించింది. ఏడాది జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధించింది. బాధితురాలికి 50 వేల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.