హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య కళాశాల తనిఖీ చేసిన కలెక్టర్

JN: ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం ఆయన కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డిజిటల్ బోధన, వసతి గృహాలు, భోజన వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.