హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుంగ్ ఫు శిక్షణతో మానసిక స్థైర్యం,శారీరక దారుఢ్యం

MNCL: కుంగ్ ఫు శిక్షణ వల్ల మానసిక స్థైర్యంతో పాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందని మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు పేర్కొన్నారు. ఏడవ జాతీయస్థాయి కుంగ్ ఫు పోటీల్లో మందమర్రి విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి 12 గోల్డ్ మెడల్స్ సాధించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.