హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కజొన్న సాగుతో అధిక లాభాలు

NLG: మొక్కజొన్న సాగుతో రైతులు మంచి ఆదాయం పొందవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె. మదన్‌మోహన్‌ తెలిపారు. గురువారం రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో డీహెచ్‌ఎం-121 హైబ్రిడ్‌ రకం సాగు విధానం, కలుపు నివారణ, పురుగులు, తెగుళ్ల నియంత్రణపై రైతులకు వివరించారు. శాస్త్రీయ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.