హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినిపై దాడి ఘటనపై విచారణకు ఆదేశం

SRPT: మునగాల మోడల్ స్కూల్లో విద్యార్థినిపై తోటి విద్యార్థి దాడి చేసిన ఘటనపై ఎంఈవో పిడతల వెంకటేశ్వర్లు విచారణ అధికారిగా నియమితులయ్యారని ప్రిన్సిపల్ వీరబాబు గురువారం తెలిపారు. జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు తాను సెలవులో ఉన్నానని, దీనిపై లిఖితపూర్వక వివరణ అందజేస్తానని వెల్లడించారు.