హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుగురు కుటుంబాలకు రూ.12 లక్షల బీమా

JGL: మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద ఆరుగురు ఖాతాదారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షల బీమా చెక్కులను గురువారం పంపిణీ చేశారు. రీజియన్ సీనియర్ మేనేజర్ అనిల్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ కిరణ్, ప్రజాప్రతినిధులు చెక్కులు అందజేశారు.