హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రానైట్ దుకాణంలో చోరీ.. రూ.30 వేల సరుకు మాయం

SRCL: బోయినపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో శక్తి మార్బుల్స్ అండ్ గ్రానైట్స్ దుకాణంలో చోరీ జరిగింది. నవంబర్ 18న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దుకాణంలోకి ప్రవేశించి సుమారు రూ.30 వేల విలువైన గ్రానైట్ రాళ్లను ఎత్తుకెళ్లారు. ఉదయం విషయం గుర్తించిన యజమాని సుంకపాక శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.