హైదరాబాద్: 28°C
తెలంగాణ

భిక్కనూర్ సర్పంచ్‌పై దాడికి యత్నం.. వార్డు సభ్యుడిపై కేసు

KMR: భిక్కనూర్ సర్పంచ్ బాల్యాల రేఖపై దాడికి యత్నించి, చంపుతానని బెదిరించిన 14వ వార్డు సభ్యుడు ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. GPలో సమావేశం జరుగుతుండగా అసభ్యంగా దూషించారని, బయటకు వెళ్తుండగా అడ్డుకున్నారని సర్పంచ్ ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.