హైదరాబాద్: 28°C
తెలంగాణ

TUWJ జిల్లా అధ్యక్షుడిగా మురళి

NB: TUWJ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్‌కు చెందిన పుట్టి మురళి ఎన్నికయ్యారు. రసవత్తరంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో ఆయన 67 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. తనను గెలిపించిన జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు శక్తివంచనా లేకుండా కృషి చేస్తానన్నారు.