హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షేత్రాల దర్శనం కోసం డీపో నుంచి ప్రత్యేక సర్వీసు

నిర్మల్ పంచారామ క్షేత్రాల దర్శనం కోసం ఈ నెల 30న నిర్మల్ డీపో నుంచి ప్రత్యేక సర్వీసు ఏర్పాటు చేసినట్లు డీపో మేనేజర్ కల్పన తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రకు ఒక్కొక్కరికి రూ.3,500 ఛార్జీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అమరారామం, సోమారామం, క్షీరారామం, ద్రాక్షారామం, కుమారారామం క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించారు.