హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణంలోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం!

హన్మకొండ: 108 అంబులెన్స్‌లో గర్భిణికి సురక్షితంగా ప్రసవం జరిగింది. పెగడపల్లి గ్రామానికి చెందిన ప్రతి రాజేశ్వరి (25) ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈఎంటీ మమత, పైలట్ బిక్షపతి సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవం సజావుగా జరిగేలా చూశారు. అనంతరం తల్లీబిడ్డలను సీకేఎం ఆసుపత్రికి తరలించారు. శిశువుకు అప్గార్ స్కోర్ 10 నమోదవగా, ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.