హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్యాంగ దినోత్సవ సదస్సును విజయవంతం చేయాలి'

RR: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26న మధ్యాహ్నం 3గంటలకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని BJP ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి తాండ్ర రవీందర్ పిలుపునిచ్చారు. నిన్న ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.