హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప స్వాములకు ఉచిత షుగర్ పరీక్షలు

JGL: రాయికల్‌ పట్టణంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా 36 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి షుగర్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం షుగర్ నియంత్రణ, ఆహారం, వ్యాయామంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్, సభ్యులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.