హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురపాలికల్లో భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు

NLG: పర్యావరణహితం కోసం ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో వీటి వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. జిల్లా వ్యాప్తంగా పురపాలికల్లో భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది సేకరిస్తున్నట్లు సమాచారం. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు బహిరంగంగానే సాగుతున్నా అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.