హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్నూర్ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర ఎంతంటే?

KMR: మద్నూర్ మార్కెట్‌లో పత్తి ధర క్రమ క్రమంగా పెరుగుతోంది. గత 15 రోజుల్లో క్వింటాలుకు రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.9,350 పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంట దిగుబడి తగ్గడంతో ధర పెరుగుతోందని చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు జుక్కల్, పిట్లం, గాంధారి, కంగ్జీ మండలాల నుంచి రైతులు పత్తిని విక్రయానికి తీసుకొస్తున్నారు.