హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిర్పూర్‌లో అత్యల్పంగా 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత

ASF: జిల్లాలోని పలు మండలాల్లో గడిచిన 24 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ (యు)లో అత్యల్పంగా 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. తిర్యాణిలో 17.1, కెరమెరి 17.9, జైనూర్ 18.3, వాంకిడి 19.1, లింగాపూర్లో 19.2 డిగ్రీలు నమోదయ్యాయి. మిగిలిన మండలాల్లో 20 నుంచి 22 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.