హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి

MLG: నవంబర్ 26న హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే సంవిధాన్ రక్షా మార్చ్‌కు ములుగుజిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు అధికసంఖ్యలో తరలిరావాలని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ కోరారు. ఉదయం 10.30 గంటలకు ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహంనుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ములుగులోని గట్టమ్మ ఆలయం నుంచి ఉదయం 6గంటలకు బయలుదేరనున్నారు.