హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుంగిన కాలువ పైకప్పు.. ప్రమాదాల భయం

MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో మురుగు కాలువ పైకప్పు కుంగిపోయింది. సమీపానికి వస్తే తప్ప గుంత కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తు చేయాలని కోరుతున్నారు.