హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

BHPL: జిల్లాలో రేపటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో వీఏఓల ద్వారా పంపిణీ చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులు, ఇతర మహిళలు కలిపి మొత్తం 1.42 లక్షల మందికి ఉచితంగా చీరలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.