హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్, బీమా పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MBNR: కొత్తకోట మండలం అమడబాకులలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పర్యటించి లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించి పత్రాలు పంపిణీ చేశారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దుతామని, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.