హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలకుర్తి వల్మిడి ఆలయంలో భక్తుల పూజలు

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా బుధవారం భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.