హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండేళ్లుగా అసంపూర్తిగా తరగతి గదులు

GDWL: తిమ్మన్‌దొడ్డి మండలం నందిన్నె గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం రెండేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో గదుల కొరత ఏర్పడి విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరతా లేక అధికారుల పర్యవేక్షణ లోపమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.