హైదరాబాద్: 28°C
తెలంగాణ

అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

GDWL: కేటీ దొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సరైన మురుగునీటి కాలువలు లేక ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీంతో తీవ్ర దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి కాలువలు, ఇంకుడు గుంతలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.