భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు కల్వర్టు గోడను ఢీకొని పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదానికి గల కారణాలు, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు


