హైదరాబాద్: 28°C
తెలంగాణ

దురదపాడులో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

BDK: దమ్మపేట మండలం దురదపాడు గ్రామంలో అశ్వారావుపేట సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇళ్లు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం స్థానికులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రోడ్డు భద్రత, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు.