హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పనిచేస్తూ ఉపాధి కూలీ మృతి

VZM: వంగర (M) మడ్డువలస గ్రామానికి చెందిన తివనాన శంకరరావు(62) ఉపాధి హామీ పనులు చేస్తుండగా అస్వస్థతకు గురై మృతి చెందారు. నిన్న గూడ చెరువు పనుల్లో పాల్గొన్న ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. తోటి కూలీలు ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించినా అప్పటికే మరణించారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.