హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేస్తే పోలీసులను ఆశ్రయించాలి'

SRCL: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సిరిసిల్ల పట్టణ సీఐ ఎన్. శ్రీనివాస్ సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్‌లో లేదా 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. స్టేషన్‌కు రాలేని వృద్ధుల వద్దకే వచ్చి ఫిర్యాదు స్వీకరిస్తామని భరోసా ఇచ్చారు.