హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముళ్ళపొదలతో నిండి ఇరుకుగమారిన రహదారి

నిర్మల్ జిల్లా భైంసా మండలం హస్తుల్ గ్రామానికి ప్రవేశించే రహదారికి ఇరువైపుల పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు పెరిగి రహదారి పైకి వచ్చి చేరాయి. దీంతో రహదారి ఇరుకుగా మారడంతో ప్రయాణం సాగించే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి ముళ్లపొదలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.