CTR: గుడిపల్లి మండలం మల్లప్ప కొండపై కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కొండపై వైభవంగా దీపోత్సవం జరిపారు. స్వామివారి దర్శనం కోసం స్థానికులతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హరహర మహాదేవ నామస్మరణతో కొండ మార్మోగింది.
ఆంధ్రప్రదేశ్
మల్లప్ప కొండపై కార్తీక పౌర్ణమి వేడుకలు


