VSP: శ్రీకృష్ణాపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జగదీష్ జాతీయ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. అండర్-14 విభాగంలో ఈనెల 12న తెనాలిలో జరిగిన రాష్ట్ర పోటీల్లో సత్తా చాటాడు. ఈనెల 27 నుంచి మధ్యప్రదేశ్ ఉమారియాలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననున్నాడని పీఈటీ విద్యాసాగర్ తెలిపారు. సమన్వయాధికారి రామకృష్ణ, ప్రిన్సిపల్ సత్యవతి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు జగదీష్ ఎంపిక


