హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులపై విరిగిపడిన జ్వాలాతోరణం

ASF: కాగజ్ నగర్ మండలం ఈస్గాం శివమల్లన్న ఆలయంలో పెను ప్రమాదం తప్పింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం కింద నుంచి భక్తులు దాటుతుండగా మంటలు అధికమై తోరణం ఒక్కసారిగా విరిగి భక్తులపై పడింది. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.