హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెయిడ్ న్యూస్‌పై ఎన్నికల యంత్రాంగం హెచ్చరిక

ASR: ఎన్నికల ప్రకటనలకు MCMC ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరని జిల్లా ఎన్నికల యంత్రాంగం హెచ్చరించింది. వార్తల రూపంలో అభ్యర్థులకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా డబ్బులు చెల్లించి ప్రచారం చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. పెయిడ్ న్యూస్‌గా తేలితే అభ్యర్థులకు నోటీసులు జారీచేసి, ప్రచార ఖర్చు ఎన్నికల వ్యయంలో కలుపుతామంది. ప్రకటనల బిల్లులు, రసీదులు భద్రపరచి నమోదు చేయాలంది.