హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్వాలాతోరణం

కృష్ణ: కార్తీక పౌర్ణమి సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైభవంగా జ్వాలాతోరణం నిర్వహించారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు పర్యవేక్షణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్వాలాతోరణం దాటి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.