ఎన్టీఆర్: జిల్లాలో కురిసిన వాన అన్నదాతల ఆశలను నీరు గార్చింది. నందిగామ, తిరువూరు మండలంలో ఆరబోసిన ధాన్యం మంగళవారం కురిసిన వర్షానికి తడిసిముద్దైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడిసిపోవడంతో అన్నదాతలు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇప్పటికే వరుస తుఫాన్ల వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల ఆశలపై 'నీళ్లు'!


