TG: కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం సుమారు 70 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. 60,600 మంది ధర్మదర్శనం, 8,000 మంది ప్రత్యేక దర్శనం, 1,400 మంది బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారి సేవలో పాల్గొన్నారు. రద్దీ దృష్ట్యా ఉదయం 4 గంటల నుంచే వ్రతాలు ప్రారంభించారు. మొత్తం 2,410 సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు.
వార్తలు
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు


