హైదరాబాద్: 28°C
వార్తలు

సినీ పురస్కారాల వేడుకలపై కీలక నిర్ణయం

AP: సినీ పురస్కార కార్యక్రమాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక నంది అవార్డులు, జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు ఇతర సినీ పురస్కారాల నిర్వహణ బాధ్యతలను సీనియర్ IAS అధికారి S.S.రావత్‌కు అప్పగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డుల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖను ఆదేశించింది.