హైదరాబాద్: 28°C
వార్తలు

నీ ఆత్మ‌విశ్వాసం అద్భుతం మనోహర్: లోకేష్

AP: సోషల్ మీడియాలో వైరలైన మనోహర్ డ్యాన్స్ వీడియోపై మంత్రి లోకేష్ ప్రశంసలు కురిపించారు. 'నాటు నాటు పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశావు మనోహర్. నువ్వు షాట్ పుట్ అథ్లెట్, సింగర్ అని తెలిసి సంతోషించా. నీ సంకల్పానికి ఆ విధి సైతం చప్పట్లు కొట్టాలి. నీ ఆత్మవిశ్వాసం అద్భుతం. RDTలో దివ్యాంగులకు నైతిక విలువలతో కూడిన విద్య, క్రీడలు, నైపుణ్యాలు నేర్పిస్తున్నారని తెలుసుకొని సంతోషించా' అని ట్వీట్ చేశారు.