హైదరాబాద్: 28°C
వార్తలు

మిరాలం చెరువు అభివృద్ధిపై రేవంత్ సమీక్ష

TG: మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై CM రేవంత్ ఆరా తీశారు. చెరువు అభివృద్ధితో పాటు చెరువులో ఎంతోకాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని అధికారులను ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలన్నారు. జనవరి 2028 నాటికి దీనిని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు CMకు వివరణ ఇచ్చారు.