SRCL: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి జ్వాలాతోరణం నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జ్వాలాతోరణాన్ని ప్రారంభించారు. అర్చకుల ప్రత్యేక పూజల అనంతరం జ్వాలాతోరణం వెలిగించగా, భక్తులు దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
వార్తలు
వేములవాడ ఆలయంలో జ్వాలాతోరణం


