KMR: రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో సోమవారం చెరకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బీరంకల్ తండాకు చెందిన రమేశ్ మృతి చెందగా, కారులోని మరో ఐదుగురు గాయపడ్డారు. రామారెడ్డి పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. బీఎన్ఎస్ 106(1) కింద కేసు నమోదు చేశారు.
తెలంగాణ
కారును ఢీకొన్న చెరకు ట్రాక్టర్

