హైదరాబాద్: 28°C
తెలంగాణ

కప్రాయిపల్లిలో ధాన్యం కోసం ధర్నా

BHNG: భూదాన్ పోచంపల్లి మండలం కప్రాయిపల్లిలో రైతులు ధాన్యం కొనుగోలు కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెస్తున్నా కొనుగోళ్లు ప్రారంభం కాలేదని, వెంటనే గ్రామంలో కేంద్రం ఏర్పాటు చేసి కొనాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైస్ మిల్లర్లకు తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుందని సీపీఐ నేత గోడల్ల నాగభూషణం, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.