MHBD: బయ్యారం బస్టాండ్ సెంటర్ సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీకేజీ ఏర్పడి నెలలు గడుస్తోంది. తాగునీరు వృథా కావడంతో పాటు లోతుగా తీసి వదిలేసిన గొయ్యిలో నీరు నిలిచి కలుషితం అవుతోంది. వర్షం పడిన సమయంలో డ్రైనేజీ నీరు ఈ గోతిలోకి చేరుతోంది. రద్దీగా ఉండే దారిలో తీసిన ఈ గొయ్యి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రధాన రహదారిలో ప్రమాదకరంగా గొయ్యి

