హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS నేతలు హౌస్ అరెస్ట్

HYD: ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులను కలుస్తామని BRS నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా BRS నేతలు సబితా ఇంద్రారెడ్డి, దాసోజ్ శ్రవణ్ సహా మరికొందరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎర్రమంజిల్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని BRS నేతలు ఖండించారు.